తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో నితిన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్రపరిశ్రమలోనే హీరోగా నిలదొక్కుకుంటూ  ఎంతో మంది అభిమానులను అలరిస్తూ  ఎంతోమందికి ఫేవరెట్ హీరో గా మారిపోయాడు. అయితే నేటితో నితిన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఏకంగా 18 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నాడు. 

 


 తాజాగా నితిన్ కెరియర్ కు సంబంధించి నిర్మాత బి.ఎ.రాజు ఒక పోస్ట్ పెట్టగా ప్రస్తుతం అది వైరల్ గా మారిపోయింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 18 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తిచేసుకున్న నితిన్ కి  శుభాకాంక్షలు తెలిపారు నిర్మాత బి.ఎ.రాజు. నితిన్  జర్నీ కచ్చితంగా ఎంతో ప్రశంసనీయమైన ప్రయాణం అంటూ చెప్పుకొచ్చారు. తన కెరీర్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారని... కానీ ఎప్పుడూ వెనకడుగు మాత్రం వెయ్యలేదని తిరిగి పోరాడుతూనే వచ్చారు అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత బి ఏ రాజు. నితిన్ నటించిన 27 సినిమాలు అతనిలోని నటుని పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి నిరూపించాయి అంటూ చెప్పుకొచ్చారు. ఎలాంటి పాత్రలోనైనా నితిన్ ఒదిగిపోయి నటించగలడు అని  ప్రశంసలు కురిపించాడు బి.ఏ.రాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: