ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ని క్రికెట్ స్టార్  అనాలా  లేదా సోషల్ మీడియా స్టార్ అనాలా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మొన్నటివరకు క్రికెట్ లో మెరుపులు మెరిపించి స్టార్ గా నిరూపించుకున్న డేవిడ్ వార్నర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో హీరోలకు మించిన క్రేజ్  సంపాదిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ స్టార్ గా మారిపోతున్నాడు డేవిడ్ వార్నర్. 

 

 ఇప్పటికే తెలుగు హీరో లకు సంబంధించిన పలు పాటలను సెలెక్ట్ చేసుకొని వాటిపై డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను మైమరిపించాడు వార్నర్.  తాజాగా మరోసారి అద్భుతమైన డాన్స్  తో అదరగొట్టాడు. అయితే ఇంతకుముందు వరకు స్టెప్స్  మాత్రమే వేసిన డేవిడ్ వార్నర్ ఈసారి రిస్క్ చేసాడనే చెప్పాలి. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురములో  సినిమా లోనుంచి బుట్ట బొమ్మ సాంగ్ డాన్స్ చేస్తూ... ఏకంగా తన భార్యను భుజాలపై ఎత్తుకొని డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం ఈ వీడియో  సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: