ఈ మద్య చైనా పేరు చెబితే ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి.  ఇక్కడ నుంచి పుట్టికొచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తుంది.  ప్రతిరోజూ మరణాల సంఖ్య, కేసుల సంఖ్య దారుణంగా పెరిగిపోతున్నాయి.  అసలు మనుషుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది.  చైనాలో  ఆయిల్‌ ట్యాంకర్‌ లారీ పేలిన ఘటనలో పది మంది మృతిచెందగా, మరో 117 మంది గాయపడ్డారు. చైనాకు తూర్పున ఉన్న ఝేజియాంగ్‌ రాష్ట్రంలోని లియాంగ్‌షాన్‌ ప్రాంతంలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.

 

కాగా, పేలిన సమయంలో చుట్టు పక్కల ఉన్న వాహనాలకు, ఇతర వస్తువులకు మంటలు అంటుకొని ప్రమాదం మరింత పెరిగిపోయింది.  కొన్ని గృహాలు, ఫ్యాక్టరీ వర్క్‌షాపులు కూడా ధ్వంసమైనట్టు తెలిపారు. సమాచారం తెలసిన వెంటనే పలు అగ్నిమాపక యంత్రాలను తీసుకుని 400 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: