ప్రస్తుతం కరోనా వైరస్ కష్టకాలంలో పోలీసులకు తిప్పలు తప్పడం లేదు అన్న విషయం తెలిసిందే. కరోనా  భయంతో ఎంతో మంది ఇంటికి పరిమితమైనప్పటికీ పోలీసులు మాత్రం తమ విధి నిర్వహణలో నిమగ్నం అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే రోజురోజుకు పోలీసులు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతున్న  విషయం తెలిసిందే. 

 


 అయితే తాజాగా ముంబయ్ లోని కుర్ల ప్రాంతం నెహ్రూ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు చెంబూర్ లోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో చోరీ కేసులు ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు  తరలించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించి ఐదుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆ దొంగలను ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తుండగా ఆ దొంగలను పట్టుకుని కోర్టుకి విచారణ కోసం తరలించిన పోలీసులకు కూడా పరీక్షలు నిర్వహించగా పదిమందికి పాజిటివ్ అని తేలింది. దొంగల కారణంగా కరోనా  వైరస్ బారిన పడిన 10 మంది పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: