గత కొంత కాలంగా దాయాది దేశం పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పపతూనే ఉంది.  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా చేసుకొని వరుస దాడులకు పాల్పపడుతున్నారు. అయితే భారత సైన్యం కూాడా ఉగ్రవాదులకు సరైన బుద్ది చెబుతూనే ఉంది.  రాత్రి జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లా షాహ్‌పూర్‌ కేర్ని సెక్టార్‌ సరిహద్దు వద్ద పాకిస్తాన్‌ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఓ జవాను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

పాక్‌ కాల్పులను భారత సైన్యం కూడా సమర్థవంతంగా తిప్పి కొట్టింది.  పాకిస్తాన్‌ గత ఆర్నేళ్ల కాలంలో సుమారు 2 వేల సార్లు కాల్పులకు పాల్పడినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ మీడియాకు తెలిపారు.  గతేడాది అక్టోబర్‌లో అత్యధికంగా 398, నవంబర్‌లో 333, ఆగస్టులో 323, జులైలో 314, సెప్టెంబర్‌లో 308, మార్చిలో 275 సార్లు పాకిస్తాన్‌ కాల్పులకు పాల్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: