కరోనా రావడం ఏమో గాని దాని చికిత్స మాత్రం చాలా ఖరీదైనది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ప్రభుత్వాలు ఉచితంగా కరోనా చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఒక వ్యక్తికి ఏకంగా 8 కోట్ల వరకు కరోనాకు ఖర్చు అయింది. వివరాల్లోకి వెళితే మైఖేల్ ఫ్లార్ అనే వ్యక్తి వయసు 70 ఏళ్ళు. అమెరికాలోని సియాటెల్ లో నివాసం ఉంటున్నాడు. 

 

ఆయన కరోనా రావడంతో మార్చ్ నాలుగున స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక 62 రోజుల పాటు కరోనాతో పోరాడి ఆయన ఎలా అయినా సరే బయటపడ్డాడు. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఇక మే 5 న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా బిల్లు 1.1 మిలియన్ డాలర్లు అయింది అని చెప్పడంతో షాక్ అయ్యాడు. మైఖేల్‌కు  ఇన్సూరెన్స్ ఉండటంతో ఆస్తులు అమ్మాల్సిన అవసరం లేకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: