కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా స్వదేశీ నినాదం అనేది  ఎక్కువగా వినపడుతుంది. స్వదేశీ వస్తువులనే వాడాలి అని ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరూ కూడా ఇప్పుడు పిలుపు ఇస్తున్నారు.  ప్రధాని ఇటీవల మాట్లాడుతూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చెయ్యాలి అని ఇక్కడి ఉత్పత్తులను ప్రోత్సహించాలి అని చెప్పిన సంగతి తెలిసిందే. 

 

తాజాగా రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు చేసారు. విదేశాల నుండి వస్తువుల దిగుమతిని ఆపాలని మన ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మన దేశాన్ని ప్రపంచంలో దిగుమతి చేసుకునే దేశంగా పిలవకూడదు, భారతదేశాన్ని ఎగుమతి చేసే దేశంగా పిలవాలని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: