దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తోంది. కరోనా వైరస్ విజృంభణ వల్ల ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరుగుతోంది. 2020 - 2021 విద్యాసంవత్సరం నుంచి సగం సిలబస్ ను ఆన్ లైన్ ద్వారా పూర్తి చేయాలని పలు యూనివర్సిటీలు నిర్ణయం తీసుకున్నాయి. అందుకు తగిన విధంగా ఆయా యూనివర్సిటీలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలోనే ఏపీ విద్యార్థులకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. నాగార్జున వర్సిటీ పరిధిలోని 218 కళాశాలల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. డీన్ రామిరెడ్డి  మీడియాకు ఈ విషయాలను తెలియజేశారు. డిగ్రీ కాలేజీల వివరాలను ఈ నెల 15 నుంచి 24 వ తేదీ వరకు వర్సిటీలోని కళాశాలల డీన్ కార్యాలయంలో పరిశీలించనున్నారని తెలుస్తోంది. కేటగిరీ, యూనివర్సిటీ ఆమోద పత్రాలు, కోర్సులు, వసతి సదుపాయాలు ఇతరత్రా వివరాలకు సంబంధించిన వాటితో కళాశాలల యాజమాన్యాలు హాజరు కావాలని డీన్ రామిరెడ్డి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: