దేశంలో కరోనా  వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూ ఎంతో ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా 20 వేల దగ్గర మహమ్మారి వైరస్ కాస్త కంట్రోల్ లో ఉంది అనుకుంటున్న తరుణంలో ఒక్క సారిగా లాక్ డౌన్ సడలింపు ఇవ్వటం ఆ తర్వాత లక్షా రెండు లక్షలు ఏకంగా ఇప్పుడు మూడు లక్షలు దాటిపోయింది. దీంతో తర్వాత ఎలాంటి ముందడుగు వేయాలని దానిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 


 ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించబోతున్నారు అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్  షా అత్యవసర  సమావేశం కానున్నారు.  ఈ నేపథ్యంలో జూన్ 15 తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటిస్తారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ మహమ్మారి వైరస్ కంట్రోల్ లో ఉన్న రాష్ట్రాలలో మాత్రం  ఇలాంటి ఆలోచన సరికాదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం  నిర్ణయించబోతుంది అనేది రానున్న రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: