దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఇక దీని దెబ్బ ఆటో మొబైల్ రంగం మీద భారీగా పడింది. ది ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఏడీఏ) తాజాగా విడుదల చేసిన లెక్కల ఆధారంగా చూస్తే దేశంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,02,697 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి చూస్తే 18,21,650 వాహనాలు రిజిస్టర్ చేసారు. 

 

తొలిసారి దేశ చరిత్రలో ఏప్రిల్ నెలలో రిటైల్ విక్రయాలు జరగలేదని చెప్పారు. ఏప్రిల్ నెల చివరి నాటికి లాక్ డౌన్ సడలింపుల నాటికి 26,500 షోరూములు, 80 శాతం వర్క్ షాపులు తెరుచుకున్నాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: