కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ కి అండగా నిలిచారు. ఉదయం హైలెవెల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి సంబంధించి అమిత్ షా తో కేజ్రివాల్ అన్ని విధాలుగా చర్చలు జరిపారు. ఏ విధంగా చర్యలు తీసుకుంటే కరోనా ను ఎదుర్కోవచ్చు అనే దాని మీద ఒక ప్రణాళిక కూడా సిద్దం చేసి కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. 

 

ఇక ఈ నేపధ్యంలోనే అలా సమావేశం అయిందో లేదో అమిత్ షా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు ఐఏఎస్‌లను ఢిల్లీకి బదిలీ చేశారు. వీరు నలుగురు కూడా కేజ్రివాల్ కి అండగా నిలబడతారు. అండమాన్ నికోబార్‌లో విధులు నిర్వర్తిస్తున్న అవనీశ్ కుమార్, మోనికా ప్రియదర్శినితో పాటు అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న గౌరవ్ సింగ్ రాజావత్, విక్రమ్ సింగ్ మల్లిక్‌ను ఢిల్లీకి బదిలీ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: