లాక్ డౌన్ లో ఖాళీ గా ఉన్న చిన్నారులు ఇప్పుడు తమ బుర్రకు పదును పెడుతున్నారు. ఏదోక కొత్త వస్తువుని తయారు చేయడానికి గానూ తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కేరళ కుర్రాడు ఒక బైక్ ని తయారు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. 

 

కొచ్చిలోని తన తండ్రి ఆటోమొబైల్ వర్క్‌షాప్‌లోని స్క్రాప్ మెటీరియల్‌లను ఉపయోగించి 9 వ తరగతి విద్యార్థి అర్షద్ టిహెచ్ తేలికపాటి మోటారుసైకిల్‌ను తయారు చేశాడు. దీనిపై ఆ బాలుడు మాట్లాడుతూ "ఈ బైక్ తయారు చేయడానికి నేను ఒకటిన్నర నెలలు తీసుకున్నాను. ఇది 1-లీటర్ పెట్రోల్‌లో 50 కిలోమీటర్ల వరకు నడపగలదు. ఈ సారి తాను ట్రాలీ తయారు చెయ్యాలని అనుకుంటున్నట్టు వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: