ఆనంద గజపతిరాజు నిజమైన వారసులం తామేనని ఇద్దరు మహిళలు మీడియా ముందుకు వచ్చారు. ఆనంద గజపతిరాజు భార్య సుధా గణపతిరాజు, కుమార్తె ఊర్మిళా గణపతిరాజు అధికారిక పత్రాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. సంచయిత గణపతిరాజు ఆనంద గజపతిరాజు వారసురాలు అని చెప్పుకోవడానికి ఒక్క ఆధారమైనా చూపించాలని... వారసత్వ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తామని అన్నారు. 
 
1991 సంవత్సరంలో ఆనంద గజపతిరాజు, సంచయిత తల్లి ఉమా గజపతిరాజు విడాకులు తీసుకున్నారని... ఆస్తుల పంపకాలు, అందుకు అన్ని ఆధారాలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. తండ్రి స్వహస్తాలతో రాసిన వీలునామా ఆధారంగా ప్రస్తుతం ఆస్తులు తమకే చెందుతాయని చెప్పారు. ఆమెకు వివాహం కాకముందు ఆస్తులు విక్రయించకూడదని పత్రాల్లో స్పష్టంగా ఉందని ఆమె ఆ ఆస్తులను విస్మరించి అమ్మడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: