బాలీవుడ్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ఆత్మహత్య చేసుకొని చనిపోవడం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య. ఒక్కసారిగా డిప్రెషన్ లోకి  వెళ్లి పోయినా సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. 

 

 సుశాంత్ సింగ్ రాజ్ పుత్  తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు సుశాంత్ మరణవార్త విని కన్నీరుమున్నీరయ్యారు. తాజాగా పాట్నా లోని తన నివాసం నుంచి విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి ముంబై కి సుశాంత్ సింగ్ ఇంటి వద్దకు బయలుదేరనున్నారు కుటుంబ సభ్యులు. ఇక సుశాంత్ సింగ్ బంధువైన బిజెపి ఎమ్మెల్యే నిరాజ్ కుమార్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు బయల్దేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: