భారత్ లో కరోనా కేసులు జోరు చూపిస్తున్నాయి.. ఆదివారం దాదాపు 12 వేల కేసులు నమోదు కాగా.. ఇవాళ కాస్త తగ్గినా.. కేసుల సంఖ్య భారీగానే ఉంది.  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 325 మరణాలు సంభవించగా.. కొత్తగా 11,502  కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత రెండు నెలల క్రితం బారత్ అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడైతే లాక్ డౌన్ విషయంలో సడలింపు చేయడం.. వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపడం తర్వాత కేసులు విపరీతంగా పెరిగిపోవడం మొదలు పెట్టాయి.   

 

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,424కు  చేరగా.. మరణాల సంఖ్య 9520కు చేరింది. ఇప్పటివరకు 1,69,798 మంది కరోనా నుంచి కోలుకోగా..1,53,106 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1,07,958 కరోనా కేసులు నమోదవ్వగా..3950 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విషయం మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: