బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చారు. ఇక అతని కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలను సేకరించారు. ఇక అతని కాల్ డేటా సహా అనేకం ఇప్పుడు విచారిస్తున్నారు. ఈ నేపధ్యంలో అతని మేన మామ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

అతను ఆత్మహత్య చేసుకున్నాడని మేము అనుకోమని అన్నారు, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు. అతని మరణం వెనుక కుట్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అతడు హత్య చేయబడ్డాడని... బీహార్లోని పాట్నాలోని సుశాంత్ నివాసం బయట మీడియాతో మాట్లాడుతూ సుశాంత్ మేన మామ ఈ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: