మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దక్షిణ మహారాష్ట్ర మొత్తం కూడా ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల తుఫాన్ దెబ్బకు ఇబ్బంది పడిన మహారాష్ట్ర ఇప్పుడు వర్షాల దెబ్బకు మరోసారి తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఇక ఇదిలా ఉంటే అక్కడ వరదలు కూడా వస్తున్నాయి. కరోనాతోనే ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి వరదలు ఇప్పుడు తల నిప్పిగా మారాయి. 

 

మహారాష్ట్ర జల్గావ్‌లోని డాక్టర్ ఉల్హాస్ పాటిల్ మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి అత్యవసర వార్డులో వర్షపు నీరు ప్రవేశించింది. వార్డులో చేరిన 7-8 మంది రోగులను సురక్షితంగా తరలించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఇక అక్కడ మరో రెండు రోజుల పాటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: