దేశంలో కొవిడ్‌-19‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,502 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 325 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 3,32,424 చేరగా, మృతుల సంఖ్య మొత్తం  9,520కి పెరిగింది. 1,53,106 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,69,798 మంది కోలుకున్నారు.  అయితే కరోనా వల్ల ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది.. కేసులు పెరుగుతున్నది మాత్రం మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు ప్రాంతాలే.. ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభిస్తుంది. 

 

ఇక ఏపీలో గడచిన 24 గంటల్లో 15,173 నమూనాలు పరీక్షించగా 246 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5 వేలు దాటింది. ఇప్పటివరకు 5087 మందికి కరోనా నిర్ధారణ అయింది.  కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మృత్యువాత పడగా మరణాల సంఖ్య 86కి పెరిగింది. తాజాగా  47 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో, ఇప్పటిదాకా 2,770 మంది డిశ్చార్జి కాగా, 2,231 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో రెండు మరణాలు నమోదయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: