ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ. 500 కోట్లు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు జగన్ కడప స్టీల్ ప్లాంట్ గురించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జగన్ సర్కార్ స్టీల్ ప్లాంట్ కోసం హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. 
 
‌ 
హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీలతో చర్చలు జరిపామంటూ అధికారులు సీఎంకు తెలియజేయగా మరోసారి ఆ కంపెనీలతో చర్చలు జరపాల్సిందిగా సీఎం అధికారులకు సూచనలు చేశారు. ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో రెండు నెలల్లోగా ఒప్పందం కుదుర్చుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: