దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడచిన 24 గంటల్లో 11 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో కరోనా కేసుల సంఖ్య 3,32,294కు చేరింది. 1,69,798 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 9,520కు చేరింది. 
 
దేశంలో కరోనా రికవరీ 51.08 శాతానికి చేరుకుంది. దేశంలో 50 శాతానికి పైగా కరోనా రికవరీ రేటు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా నుండి కోలుకుంటున్న రోగుల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. కరోనా మరణాల్లో భారత్‌ ప్రపంచంలోనే తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక కరోనా పాజిటివ్‌ కేసుల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: