గత కొన్ని రోజుల నుంచి ఏపిలో రాజకీయాలో మహా రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ సీనియర్ నేతలు అచ్చంనాయుడు, చింతమనేని ప్రభాకర్‌, జేసీ ప్రభాకర్ లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక  అచ్చెన్నాయుడిని కలిసేందుకు బయలుదేరిన చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఏలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  లాక్ డౌన్ నిబంధనలు ఉల్తంఘించారంటూ చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఏలూరు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఆయనను ఈ రోజు కోర్టులో హాజరుపర్చారు.

 

న్యాయస్థానం చింతమనేని ప్రభాకర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.  ఈ కేసులో చింతమనేనితో పాటు 8మంది అనుచరులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చింతమనేనిపై నమోదైన కేసుల సెక్షన్లు 143, 149, 188, 269, 270, 341, 353-ipc, 51(a)-DMA- 2005 గా ఉన్నాయి. 

 

ఈరోజు ఉదయం చింతమనేనిని కోర్టులో పోలీసులు హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన వెంట ఉన్న మరో ఎనిమిది మందికి బెయిల్ మంజూరు అయింది. ఈ రోజు బెయిల్ మంజూరు కాగా ఆయన రిలీజ్ ఈరోజే అవుతారా రేపు రిలీజ్ చేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: