ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరమై ఏడాది పూర్తైంది. ఏడాది కాలంలో టీడీపీ రాష్ట్రంలో రోజురోజుకు మరింత బలహీనడుతోంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ విధానాలు నచ్చక అధికార పార్టీకి బహిరంగంగా మద్ధతు తెలుపుతుంటే మరికొందరు నేతల అవినీతి, అక్రమాలు బయటపడుతూ ఉండటంతో జైళ్లపాలవుతున్నారు. ప్రజల్లో వైసీపీకి రోజురోజుకు మద్దతు పెరుగుతోంటే టీడీపీ రోజురోజుకు బలహీనపడుతోంది. 
 
2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ఆ పార్టీ అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియానే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా టీడీపీ సోషల్ మీడియా తీరు ఏ మాత్రం మారలేదు. తాజాగా టీడీపీ సోషల్ మీడియాలో "ఈ గాడిద ఉంది చూశారూ.... తన అహంకారంతో పడవ నడిపే వ్యక్తిని తన్ని నదిలోకి పడేసింది... ఇప్పుడు పడవని ఎలా నడపాలో తెలీక బిత్తర చూపులు చూస్తూ నిలబడిపోయింది. కానీ నీటి అలలకు ఆ పడవ అటూ ఇటు కదులుతుంటే చూసేవాళ్లకు (అడ్డగాడిదలకు) మాత్రం గాడిద చాలా తెలివిగా నడుపుతున్నట్టు అనిపిస్తోంది. గత ఏడాదిగా ఇదే పరిస్థితి.... ఈ గాడిదకు పడవ నడపటం రాదు... ఈ పడవ ఒడ్డుకు చేరను చేరదు" అంటూ పోస్ట్ చేసింది. 
 
ఈ పోస్ట్ లో పరోక్షంగా ప్రజలను అడ్డగాడిదలుగాను.... అధికార పార్టీ నేతను జంతువుతోను విమర్శిస్తూ టీడీపీ పోస్ట్ చేయగా కుక్క తోక వంకర అన్న చందాన టీడీపీ సోషల్ మీడియా అధికార పార్టీతో పాటు ప్రజలను కూడా విమర్శిస్తూ టీడీపీని పాతాళానికి ఎగదోస్తుందని ఆ పార్టీ నేతలకు ఎప్పటికి అర్థమవుతుందో చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: