గత కొన్ని రోజులుగా కర్ణాటక రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. వైరస్ విజృంభిస్తున్న వేళ కరోనా మహమ్మారిని కట్టడి చేయడమే లక్ష్యంగా కర్ణాటక సర్కార్ పని చేస్తోంది. రాష్ట్రంలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ విజృంభణ ఎక్కువగా ఉన్న ఢిల్లీ, చెన్నై నగరాల నుంచి రాష్ట్రానికి వస్తే మూడు రోజులు క్వారంటైన్ లో 11 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. 
 
ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి మాత్రమే కర్ణాటకలో 7 రోజులు క్వారంటైన్ విధిస్తుండగా తాజాగా ఢిల్లీ, చెన్నై నగరాల నుంచి వచ్చే వారి విషయంలో కూడా క్వారంటైన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి వల్లే కేసులు పెరిగిపోతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక సీఎం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: