ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతంలో నెలకొనే వాతావరణ పరిస్థితులతో ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
 
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని పేర్కొంది. నిన్న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. దేశంలోని గుజరాత్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, బీహార్, ఛత్తీస్ గఢ్ లోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: