తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి ప్రతిరోజూ 200కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించటానికి ఆసక్తి చూపకపోవడంతో కామారెడ్డి జిల్లాలోని దోమకొండ ప్రజలు, నాయకులు కలిసి స్వీయ లాక్ డౌన్ విధించుకున్నారు. 
 
దోమకొండ గ్రామ సర్పంచ్ తాజాగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాలకవర్గ సభ్యులు చుట్టుపక్కల ఉన్న బిక్కనూరు, రామాయంపేట, గంభీరావుపేట్, తుజాల్‌పూర్ గ్రామాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో కరోనా భారీన పడకుండా ఉండేందుకు లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మాస్క్ లేకుండా బయటకొస్తే మాత్రం రూ. 200 జరిమానా విధించాలని తీర్మానించారు. నేటి నుంచి గ్రామంలో లాక్ డౌన్ అమలు కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: