నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సిఆర్డీఏ రద్దు బిల్లు అదే విధంగా పాలనా వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశ పెట్టడానికి ఏపీ సర్కార్ సిద్దమైంది. గతంలో బిల్లులు సెలెక్ట్ కమిటీ కి వెళ్ళిన నేపధ్యంలో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ బిల్లులను ప్రవేశ పెట్టడానికి ఏపీ సర్కార్ సిద్దమవుతుంది. 

 

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తాము మళ్ళీ ఆ రెండు బిల్లులను ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నాము అని చెప్తున్నారు. దీనితో ఎం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు. ఆయన ప్రసంగం తర్వాత బిఎసి సమావేశం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: