వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు గానూ 147 వైఎస్సార్ ప్రయోగ శాలలను తాము ఏర్పాటు చేసామని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్  హరి చంద్ అన్నారు. వ్యవసాయానికి తన ప్రసంగంలో ప్రాధాన్యత ఇచ్చారు గవర్నర్. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ది సాధించామని చెప్పారు ఆయన. 

 

గ్రామాల్లో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఆయన. వైఎస్సార్ రైతు భరోసా మొదటి దశ పూర్తి చేసినట్టు ఆయన వివరించారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అన్నీ అమలు చేస్తున్నట్టు వివరించారు. రైతులకు మద్దతు ధర అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కరోనాలో వ్యవసాయ ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేసామని అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 2200 కోట్లు ఆదా చేసామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: