సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేస్తుందని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చంద్ అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇళ్ళ పట్టాలను 7 వేల కోట్లతో 30 లక్షల మందికి అందిస్తున్నామని అన్నారు.  సేవా రంగంలో వృద్ది సాధించామని చెప్పుకొచ్చారు. 

 

నాడు నేడు కింద స్కూల్స్ ని అభివృద్ధి చేస్తున్నామని మేనిఫెస్టో లో చెప్పిన హామీలను చెప్పని హామీలను కూడా అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ ఒక్కరికి అందుతున్నాయని చెప్పారు. మహిళల పేరుతో ఇళ్ళ పట్టాలను జారీ చేస్తున్నామని అన్నారు గవర్నర్. వాళ్ళ పేరుతోనే రిజిస్టేషన్ చేయిస్తామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: