గత తెలుగుదేశం పార్టీ సర్కార్ చేసిన అప్పులు తమ మీద సునామీ లా వచ్చి పడ్డాయి అని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అన్నారు. ఆయన శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కరోనాపై పోరాటం చేసే విషయంలో ముందు ఉన్నామని అన్నారు. 2018-19 లో స్థూల ఉత్పత్తి కేవలం 8 శాతమే పెరిగిందని అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజల సంక్షేమం పై వెనకడుగు వేయలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. 

 

ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి చేయకపోతే ఆదాయం ఉండదు అని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: