ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు రెండో దఫా బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా బుగ్గన చెప్పారు. బడ్జెట్ లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే సమయంలో బీసీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించింది. వ్యవసాయానికి రూ.11,891 కోట్లు కేటాయించిన ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు కేటాయించింది. 
 
రైతులకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. విద్యారంగం విద్యశాఖకు రూ.22,604 కోట్లు... వైద్య రంగానికి రూ.11,419 కోట్లు... ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు కేటాయించింది. ఇవి కాక బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు, వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ.3 వేల కోట్లు, వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.16 వేల కోట్లు కేటాయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: