ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగానికి భారీగా నిధులను కేటాయించింది. అమ్మ ఒడి కార్యక్రమానికి గానూ ఆరు వేల కోట్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం లో నాడు నేడు కోసం మూడు వేల కోట్లను కేటాయించింది. విద్యా రంగానికి 22 వేల 604 కోట్లను కేటాయించింది. విద్యా రంగంలో టీచింగ్ గ్రాంట్స్ కోసం గానూ 13,124 కోట్లను కేటాయించారు. విద్యా రంగం లో సమగ్ర శిక్ష కోసం గానూ 1937. ౦2 కోట్లను కేటాయించారు. 

 

జగనన్న గోరు ముద్ద కోసం గానూ 974.86 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జగనన్న విద్యా కానుక కోసం గానూ 500 కోట్లను కేటాయించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ లకు గానూ 493.84 కోట్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యా దీవెన కోసం గానూ 3,009 కోట్లను కేటాయించారు. వసతి దీవెన కోసం రెండు వేల కోట్లు కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: