తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గత పదిహేను రోజుల క్రితం కేసలు సంఖ్య ఎలా ఉన్నా ఈ మద్య లాక్ డౌన్ సడలింపు చేసిన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.  ఓ వైపు కరోనా పై తెలంగాణ ప్రభుత్వం యుద్దం చేస్తుంది. అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నైరుతి రుతువపనాల సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ రంగానికి ఊతమివ్వాల్సిన సమయం దగ్గరపడడం వంటి అంశాలపై సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లపై సమావేశం అయ్యారు.

 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రగతి భవన్ లో  ఉన్నతాధికారులతో ఆయన పలు కీలకాంశాలపై మాట్లాడనున్నట్టు తెలుస్తుంది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు వేసే విధంగా ప్రోత్సహించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ నియంత్రిత సాగుపై జిల్లా కలెక్టర్లతో మరింత విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇటీవల సీఎం హామీ ఇచ్చిన  రైతు బంధు పథకం కింద రైతులకు అందాల్సిన సాయం పది రోజుల్లో పూర్తవ్వాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ రంగంపైనా సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు అందజేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: