ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డీ ఏ రద్దు బిల్లు పరిపాలన వికేందీకరణ బిల్లుపై ట్విస్ట్ ఇచ్చింది. రెండు బిల్లులను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రవేశ పెట్టారు. దీనికి శాసన సభ ఆమోదం తెలిపింది. దీనిని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలిలో మళ్లీ ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు ఆయన. 

 

బిల్లులను ఇప్పటికే సెలెక్ట్ కమిటీకి చైర్మన్ రెఫర్ చేశారని అన్నారు. బిల్లులు గవర్నర్ దగ్గర, హైకోర్టులో పెండింగ్‍లో ఉన్నాయన్నారు. ఆ బిల్లులు మళ్లీ ప్రవేశపెట్టడం చట్టవిరుద్ధం, న్యాయ విరుద్ధమని అన్నారు. మండలి సమావేశాలను ఆన్‍లైన్‍లో ఏడు రోజులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు. కాగా రెండు బిల్లులను మంత్రి బొత్సా ప్రవేశ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: