దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే భారీగా సడలింపులు ఇచ్చిన కేంద్రం తాజాగా అంతర్జాతీయ విమాన సేవలను పునఃప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి జులై నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 
 
వాటాదారులు, ప్రయాణికులకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని... ఎప్పటినుంచి విమానసర్వీసులు ప్రారంభమవుతాయో కచ్చితమైన తేదీని ఇప్పుడే చెప్పలేనని అన్నారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం గత నెలలో దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించింది. 1,35,954 మంది ప్రయాణికులను గత 20 రోజుల్లో 1,464 దేశీయ విమాన సర్వీసుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: