ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ప్రజాకర్షక నిర్ణయాలతో పేదలకు ప్రయోజనం చేకూరేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్ బియ్యం కార్డులు ఉన్న పేదలకు ఇంటి దగ్గరే నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం అందుతుందని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. కోటీ 48 లక్షల కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. 
 
నిన్న బడ్జెట్ లో నాణ్యమైన బియ్యం కోసం 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం మొదట వాలంటీర్ల ద్వారా సంచులు అందించి ప్రతి నెలా బియ్యం పంపిణీ చేపట్టనుంది. పేదలకు ఉచితంగా ఇవ్వనున్న బియ్యం కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యం పంపిణీ పైలట్ ప్రాజెక్ట్ అమలవుతోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: