ఉత్తరప్రదేశ్‌లోని గోండా ప‌రిధిలో గ‌ల‌ ఖోడా ప్రాంతంలో చేపలు పడుతున్న పిల్లలకు ఒక ఆసక్తికర వస్తువు దొరికింది. ఆ ప్రాంతంలో కొంతమంది పిల్లలు కువానో నది ఒడ్డున‌ ఉన్న‌ చంద్ర మందిరం ఘాట్ ద‌గ్గ‌ర‌ చేపలు పడుతున్నారు. ఈ సమయంలో వారికి నదిలో అత్యంత పురాతన విగ్రహం ఒకటి దొరికింది. 

 

విగ్రహాన్ని బయటకు తీసి చూడ‌గా, అది కోట్ల విలువైన అష్టాధాతు విగ్రహం అని పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడి స్థానికులు. స్థానికులంతా ఈ విగ్ర‌హాన్ని చూసేందుకు ఆస‌క్తి చూపిస్తూ పెద్ద ఎత్తున బారులు తీరారు. నదిలో చేపలు పడుతున్న పిల్ల‌ల‌కు ఏదో కొట్టుకుపోతున్న‌ట్లు క‌నిపించ‌డంతో దానిని తీసి చూసి, అక్క‌డున్న‌వారికి చెప్పడంతో బయట ప్రపంచానికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: