తెలంగాణాలో వర్షాలు పడటంతో పంటల సాగు మొదలయింది. పెద్ద ఎత్తున రైతులు దుక్కి దున్ని పంటలను సాగు చేయడానికి సిద్దమయ్యారు. అయితే ఈ సమయంలో వారిని ఒక సమస్య వెంటాడుతుంది. నకిలీ విత్తనాల దెబ్బకు భయపడుతున్నారు రైతులు. ఈ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ ఒక కీలక ప్రకటన చేసింది. 

 

సిఎం కేసీఆర్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నకిలీ విత్తనాలను పట్టించిన వారికి 5 వేల బహుమతి ఇస్తామని వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏ ఇబ్బంది లేదని కేసీఆర్ ప్రకటన చేసారు. ఇక పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు ఏ మాత్రం కూడా ఉపేక్షించే ప్రయత్నం చేయవద్దు అని అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: