మహారాష్ట్రలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడి అయింది అనుకునే లోపే వేల కేసులతో ఆ రాష్ట్రంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఇక నిన్న ఒక్క రోజే అక్కడ దాదాపు 1500 మంది మరణించారు అంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ముంబై లోనే దాదాపు  900 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 1,409 మరణాలు ఆ రాష్ట్రంలో నిన్న సంభవించాయి. ముంబై నుండి 862 మంది చనిపోగా రాష్ట్ర వ్యాప్తంగా 466 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పుడు ఒక్కసారిగా మహారాష్ట్ర సర్కార్ కూడా ఉలిక్కి పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: