మ‌హారాష్ట్ర‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో తెలంగాణ‌లోని గోదావ‌రిలోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ఈ క్ర‌మంలోనే గోదావ‌రిలో నీటి మ‌ట్టం అనూహ్యంగా పెరుగుతోంది. దిగువ ప్రాంతానికి భారీ ఎత్తున వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో తెలంగాణ‌లో ఓ బ్యారేజ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన క్యాప‌ర్ డ్యాం కొట్టుకుపోయింది. సమ్మక్క బరాజ్‌ వద్ద పనుల కోసం ఏర్పా టు చేసిన కాఫర్‌ డ్యాం కొట్టుకుపోయింది. 

 

ఈ డ్యాంను ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. సమ్మక్క బరాజ్‌లోకి మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా గోదావరి ఉధృతి పెరిగింది. 75.5 మీటర్ల ఎత్తుకు నీరు చేరడంతో అడ్డుగా ఉన్న కాఫర్‌ డ్యాం తెగిపోయింది. 1 నుంచి 5వ నంబర్‌ వరకు ఉన్న పిల్లర్లు నీటమునగగా, అక్కడ ఉన్న స్టీల్‌, విద్యుత్‌ మోటర్లు, రెండు ఆఫీస్‌ కంటెయినర్లతోపాటు పరికరాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: