గత కొంత కాలంగా భారత్-చైనా బలగాలకు మధ్య లడఖ్ ప్రాంతంలోని సరిహద్దులలో ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నిన్న చైనా సైనికులు హద్దు దాటారు.. దొంగ దెబ్బ తీశారు. లడఖ్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు చేసిన దాడిలో మన సైనికులు 20 మంది అమరులయ్యారు. దాంతో యావద్ దేశం మొత్తం అట్టుడిక పోయింది.   దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు జాతి మొత్తం కన్నీటితో అంజలి ఘటిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు.

 


'దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తెలుగు బిడ్డ సంతోష్ తో పాటు 20 మంది సైనికుల కుటుంబాల కోసం నా హృదయం దుఃఖిస్తోంది.  ఇంత బాధలో ఉన్న ఆ సైనికుల తల్లిదండ్రులు తమ పిల్లలు దేశం కోసం అమరులయ్యారని... ఇది మాకు ఎంతో గర్వంగా ఉందని అనడం చూస్తుంటే నా మనసు ఎంతో ఉప్పొంగిపోతుందని అన్నారు. వారి ధైర్యానికి సెల్యూట్. జవాన్ల కుటుంబాలకు బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: