భారత్ - చైనా మధ్య తలెత్తిన సరిహద్దు ఘర్షణ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఏ మాత్రం కూడా చైనా విషయంలో వెనక్కు తగ్గవద్దు అని భావిస్తున్నారు. ఇక తాజాగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇద్దరూ బుధవారం ఫోన్ లో మాట్లాడుకున్నారు. 

 

ఇంతటి ఘర్షణాత్మక వాతావరణం తలెత్తడానికి కారణమైన వారిని శిక్షించాలని చైనా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. భారత దళాలను నియంత్రించాలని కోరారట చైనా  మంత్రి. ఈ విషయాన్ని రాయిటర్స్ అనే వార్తా సంస్థ పేర్కొంది. వాస్తవాధీన రేఖను ఇరు దేశాల జవాన్లూ గౌరవించాలని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని ఒక అంగీకారానికి వచ్చారు. జూన్ ఆరున కుదిరిన ఒప్పందం ప్రకారం కాల్పులు జరపకుండా ఉండాలి అని చైనా మంత్రిని భారత మంత్రి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: