సోమవారం రాత్రి భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. భారత సైన్యంపై చైనీస్ ఆర్మీ గాల్వన్ లోయలో దాడికి పాల్పడింది. ఈ దాడిలో 20 మంది జవాన్లు వీర మరణం పొందారు. దీంతో సోషల్ మీడియాలో చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలని... చైనా యాప్ లను నిషేధించాలని ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రధాని మోదీ చైనాకు ధీటైన సమాధానం ఇస్తామని... సైనికుల ప్రాణత్యాగం ఊరికే పోదని వ్యాఖ్యలు చేశారు. 
 
ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం వల్ల కీలక నిర్ణయం తీసుకుంది. బిఎస్ఎన్ఎల్ 4జీ అప్ గ్రేడ్ సేవలకు చైనా వస్తువులను వినియోగించబోమని ప్రకటన చేసింది. బిఎస్ఎన్ఎల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: