దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. రెండు రోజులు కాస్త తగ్గినా మరోసారి భారీగా కేసులు నమోదు అవుతున్నాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రోజు రోజుకి కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే పరీక్షలను కూడా దేశంలో వేగవంతం చేస్తున్నారు. 

 

ఇక నుంచి 3 లక్షల పరిక్షలు ప్రతీ రోజు చెయ్యాలి అని భావిస్తున్నారు. ఇక తాజాగా ఇప్పటి వరకు చేసిన కరోనా పరిక్షలపై కేంద్రం లెక్క చెప్పింది. 62,49,668 నమూనాలను జూన్ 17 వరకు పరీక్షించారని తెలిపింది. గత 24 గంటల్లో 1,65,412 నమూనాలను పరీక్షించారని చెప్పింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)

మరింత సమాచారం తెలుసుకోండి: