లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైన్యం దాడిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. సూర్యాపేటలోని ఆయన నివాసంలో పార్థివదేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి నివాళ్లు అర్పించారు. ఆ తర్వాత లాంఛనాలతో సైనిక వాహనంలో అంతిమ యాత్రగా భౌతిక కాయాన్నితరలించి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన 20 మందిలో ఒకరై హవల్దార్ సునీల్ కుమార్‌కు గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. బీహార్‌ రాష్ట్రం పాట్నాలోని ఆయన ఇంటికి భౌతిక కాయాన్ని ఆర్మీ అధికారులు చేర్చారు.

IHG

ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు తుది నివాళి అర్పించారు. ఆ తర్వాత ఆయన అనంతరం ఆర్మీ వాహనంలో అంతిమ యాత్ర నిర్వహించారు.  దేశం కోసం ప్రాణ త్యాగం చేసి అమరులైన సైనికులు యావత్ భారత దేశం సలాం చేస్తుంది. వేలాది మంది ప్రజలు ఆ వాహనం వెంట నడిచారు. మానేర్‌లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: