కేరళ సర్కార్ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేరళవ్యాప్తంగా నేటి నుంచి దేవాలయాలన్నీ మూత పడనున్నాయి. కేరళ దేవస్థానం బోర్డు ఈరోజు నుంచి భక్తులను ఆలయాల్లోకి అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని ప్రకటన చేసింది. కేరళ రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గి మరలా వైరస్ విజృంభిస్తోంది. 
 
కరోనా నివారణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేరళ సర్కార్ నుంచి ప్రకటన వెలువడింది. జూన్ నెలాఖరు తర్వాత పరిస్థితులను బట్టి తగు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. భక్తులను ఆలయాల్లోకి అనుమతించకపోయినప్పటికీ పూజా కార్యక్రమాలు యథావిథిగా జరుగుతాయని సమాచారం. మరోవైపు గల్ఫ్ దేశాల తిరిగొచ్చే ప్రవాసులు రాష్ట్రంలోకి రావాలంటే కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: