యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం బాలీవుడ్ పెద్దలేనని ఇప్పటికే పలువురు బాహాటంగానే విమర్శలు చేశారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కరణ్ జోహార్ ఏక్తాకపూర్ పై విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై రోజురోజుకు విమర్శలు పెరిగిపోతూనే ఉన్నాయి
తాజాగా నటి జియాఖాన్ తల్లి మరోసారి సల్మాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు అనుమానాస్పదంగా చనిపోవడానికి కారణం సల్మాన్ ఖానే అంటూ వ్యాఖ్యానించారు. తన కూతురు ఆత్మహత్యకు సంబంధించిన కేసు దర్యాప్తును సల్మాన్ ఖాన్ కావాలనే అడ్డుకున్నారంటూ ఆరోపించారు. తన కేసును విచారణ చేయకుండా అధికారుల మీద సల్మాన్ ఖాన్ ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు జియాఖాన్ తల్లి.