నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం విషయంలో ఏపీ ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను, ఎన్నికల సంఘం పిటిషన్‌తో జత చేసి... దీనికి సంబంధించి గ‌తంలో వచ్చిన కేసులతో కలిపి పిటిషన్ ను విచారణ జరుపుతామని తెలిపింది. 
 
జగన్ సర్కార్ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం స్టేకు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు రెండు వారాల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని సూచించింది. హైకోర్టు ఈ కేసులో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌వీకాలాన్ని కుదిస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, జీవోల‌ను కొట్టివేసింది. నిమ్మ‌గడ్డ ర‌మేశ్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియ‌మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: