వలస కార్మికుల కోసమే గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి శ్రీకారం చుట్టామని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె ఈ పథకం ప్రధాన ఉద్దేశం వివరించారు. ఈ నెల 20 న ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు అని ఆమె పేర్కొన్నారు. 

 

ఆరు రాష్ట్రాల్లో వలస కార్మికులు తిరిగి వచ్చారని అన్నారు. 25 ప్రాజెక్ట్ పనుల్లో వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. రోడ్లు భవనాలు, పంచాయితి భవనాల విషయంలో వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కాగా ఈ పథకం ఉదయం ప్రధాని కార్యాలయం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆరు రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: