టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి పై రాష్ట్ర మంత్రి అనీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కౌన్సిల్లో ఇష్టం వచ్చినట్లు చేస్తామని, విధ్వంసం సృష్టిస్తామని యనమల అన్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. స్పీకర్ గా ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర యనమలది అంటూ అనీల్ కుమార్ తీవ్ర విమర్శలు చేసారు. తనలాగే స్పీకర్ పదవుల్లో ఉన్న వారు కూడా చరిత్రహీనులు కావాలని యనమల కోరుకుంటున్నాడని ఆయన మండిపడ్డారు. 

 

అందుకే కౌన్సిల్ లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లతో యనమల తప్పు మీద తప్పులు చేయిస్తున్నాడని ఆరోపణలు చేసారు అనీల్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించనివ్వకుండా ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడం ద్వారా కౌన్సిల్ లో తెలుగుదేశం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: