ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. ఇక బరిలో వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు నిలిచారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. 

 

ఓటు ఎలా వేయాలో చూపించనున్న శాసనసభ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. వైసీపీ నుంచి బరిలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని టీడీపీ నుంచి పోటీలో వర్ల రామయ్య ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: